ఉత్తరాంధ్రకు మరో శుభవార్త.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు

విశాఖ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణ కోసం అవసరమైన ఉద్యోగుల కేటాయింపుపై రైల్వే అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Continue Reading

త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు

పేరూరు ప్రాజెక్టు కాలువ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత(MLA Parita Sunitha) అన్నారు. గంగులకుంటలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఆమె హాజరయ్యారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.13.05 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించారు. విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై జగన్‌ తన బొమ్మ వేసుకునేందుకు చూపిన శ్రద్ధ భూసమస్యల పరిష్కారంపై చూపలేదని విమర్శించారు.

Continue Reading

నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ‘మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండటంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. […]

Continue Reading

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని.. గడువులోగా మిగిలిన పనులన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన […]

Continue Reading

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్

విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. బుధవారం […]

Continue Reading