కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

జాతీัయం
Spread the love

ముంబై: రాజకీయ ప్రత్యర్థులు అధికారం కోసం కొత్త పొత్తులకు తెరతీయడం మహారాష్ట్ర (Maharashtra)లో తాజాగా సంచలనమైంది. అంబర్‌నాథ్, అకోలా మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ నేతలు కాంగ్రెస్, అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎంతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ కొత్త ‘పొత్తులు’ రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పొత్తులు ఆమోదయోగ్యం కాదని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్థానిక బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇలాంటి ఏర్పాట్లకు పార్టీ అధిష్టానం ఎంతమాత్రం అంగీకరించదని, ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *