– రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి గా యాలు
నాడు నేడు/వాజేడు/ జనవరి 9 :ము
లుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన కాకర్లపూడి వీరభద్ర రాజు అలియాస్ (వినోద్ బాబు)(52) ఆయన ఫ్యామిలీ ప్రభాస్ సినిమా రాజు సాహెబ్ రిలీజ్ కావడంతో తన సొంత ఇద్దరు కూతుర్లతో కలిసి తమ్ముడు మరో ఫ్రెండ్ ను తీసుకొని కారులో వాజేడు నుండి ఏటూరునాగారం బయలుదేరారు ఈ క్రమంలో రొయ్యూరు పెట్రోల్ బంకు సమీపం వెళ్లే లోపు ఎదురుగా వస్తున్న కంటైనర్ వాహనం ఢీ కొట్టి సుమారు 100 మీటర్ల దూరం దూసుకెల్లడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న కాకర్లపూడి వినోదు అక్కడికక్కడే మృతి చెందారు.పక్కనే కూర్చున్న తమ్ముడు మనోజ్ తీవ్ర గాయాల పాలై ఒక కాలు చెయ్యి విరిగిపోగా తలపై తీవ్రంగా గాయాలు అయ్యాయి అదే విధంగా ఇద్దరు కూతుర్లకు పెద్ద కూతురు మాధురికి కాలు విరుగగా చిన్న కూతురు మేఘనకు మూతిపై దెబ్బలు తగిలి మూడు పనులు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డారు అదేవిధంగా వాసు బాబుకు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులను 108 సహాయంతో వరంగల్ కు తరలించారు సినీ హీరో ప్రభాస్ పై ఉన్న అభిమానంతో మొదటి రోజే సినిమా చూడాలని కూతుర్లు ఒత్తిడి చేయడంతో కూతుర్ల కోరిక మేరకు తండ్రి కాకర్లపూడి వీరభద్ర రాజు అలియాస్ వినోద్ ప్రభాస్ సినిమా చూసేందుకు వెళ్లగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు దీనితో ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి అభిమాన హీరో సినిమా చూసేందుకు బయలుదేరిన అభిమానులు సినిమా చూడకుండానే ప్రమాదానికి గురై ఒకరు ప్రాణాలు కోల్పోగా నలుగురు గాయాలపడి ఆస్పత్రి పాలు అయ్యారు. అతనిపై ఉన్న అభిమానమే వీరి ప్రాణం తీసిన అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఒక రైతు కుటుంబంలో పుట్టిన కాకర్లపూడి వినోదు కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారికి ప్రభాస్ హీరో అంటే ఎంతో అభిమానం ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ రోజే చూడాలని ఆకాంక్ష అలాంటిది ఆ పిల్లల కోరిక మేరకు వాజేడు నుండి ఏటూరు నాగారం వెళ్లి సినిమా చూడాలని బయలుదేరారు ఇంతలోపే మృత్యు వెంటాడి తండ్రి కూతుర్లను వేరు చేసింది ఈ విషాదమైన సంఘటన వాజేడు మండలంలో కంటతడి పెడుతుంది.

