బీజేపీ మండల కమిటీ
బీజేపీ మండల కమిటీ 
నాడు నేడు/వాజేడు: ములుగు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వాజేడు మండలంలో గుజరాత్ లో గల సోమనాథ ఆలయం పునరుద్దరణ జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రేపు సోమనాథ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రతీ మండలంలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేయాలనీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు వాజేడు మండలం ప్రగళ్ళపల్లి గ్రామంలో గల శివాలయంలో l మండల అధ్యక్షులు పెద్ది జగపతి బాబు, ఆధ్వర్యంలో సోమనాథ ఆలయ విశిష్టత గురించి ప్రత్యేక పూజలు చేసి ఓంకార జపం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులతో పాటు వాజేడు మండల ప్రధాన కార్యదర్శి సండ్ర సోమరాజు, సీనియర్ నాయకులు యాలం సుబ్బయ్య, కుమారి, నాగరాజు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

