- అవమానం వెనకాల అకౌంటెంట్ హస్తం
- వివో ఏ లకు వత్తాసు పలుకుతున్న ఏపిఎం
నాడు నేడు/ వాజేడు:
ఒకవైపు ప్రజా ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయాలని ఉద్దేశంతో అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా పనిచేస్తున్న తరుణంలో దానికి భిన్నంగా ములుగు జిల్లా వాజేడు మండలంలో మండల సమైక్య మీటింగ్ లో దళిత మహిళలను అవమానం చేయడం గమనర్హం ఈ అవమానం వెనకాల ఓ బీసీ మహిళ అయినటువంటి అకౌంటెంట్ హస్తం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి . మండల సమైక్య మీటింగ్ జరిగిన అనంతరం వివో ఏ లు గ్రామ సమైక్య సభ్యులు మండల సమైక్య సభ్యులు భోజనం చేస్తారు భోజనం వడ్డించే క్రమంలో మండల సమైక్య కార్యదర్శి తిప్పనపల్లి ఉత్తరమ్మ భోజనం వడ్డించగా నువ్వు ఒక దళితురాలువు మాదిగ కుటుంబానికి చెందిన వ్యక్తివి నువ్వు భోజనం వడ్డిస్తే మేం తినము అంటూ వివోఏ అవమానించడం పట్ల దళిత మహిళలు మండిపడుతున్నారు. వివో ఏ తో అకౌంటెంట్ భవాని అనిపించినట్లు సమాచారం మండల సమైక్య అధ్యక్షురాలు ఇటీవల రాజీనామా చేయడం ఆమె తర్వాత ఉన్న కార్యదర్శి నీ వివోఏ అవమానపరచడం ఎంతవరకు సబబు అని మహిళలు మండిపడుతున్నారు ఇంత జరుగుతున్న ఏపీఎం వివోఏల వైపు మాట్లాడుతూ వత్తాసు పలకడం పట్ల డోక్రా సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాలకవర్గాన్ని గౌరవించాల్సిన వివో ఏలు ఎలా అవమానపరుస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మండల సమైక్య కార్యదర్శి ఉత్తరమ్మకు జరిగిన అవమానంపై డ్వాక్రా సంఘాల మహిళలు మండల సమైక్య సభ్యురాలు కలిసి వాజేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై రాజీ పడాలని ఏపీఎం సతీష్ ఒత్తిడి చేయడం గమనార్హం దళిత మహిళలను అవమానించడ పట్ల దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు దళిత మహిళలను అవమానించడానికి కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.వివో ఏలు మహిళా సంఘాల నుంచి లోన్ ఇప్పిస్తానని కొంత డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని సదరు గ్రామ అధ్యక్షురాలు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏపీఎం పట్టించుకోవడం లేదు గ్రామ సమైక్య సభ్యులు మండిపడుతున్నారు


