- ఆలయాలు, జాతరలలో ఉధ్యోగాలు, తలనీళాల ఆధాయంలో వాటాల సాధనకోసం పోరాటాలకు సిధ్దం కావాలి
నాడు నేడు/ వాజేడు :తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం వాజేడు మండల మహసభ మంగళవారం చెరుకూరు లో ముక్కెర నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించరు. ఈ కార్యక్రమానికిముఖ్య అథిధి గా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జంపాల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకే సంఘంగా మారవలసిన సమయం ఆసన్నమైందిని అన్నారు. ఆదిపత్యాలకోసం సంఘాలను విభజించడానికి ఇది రాజకీయ పార్టీ కాదు అనేవిషయం అర్ధం చేసుకోవాలని సూచించారు. హక్కులు, ఆత్మగౌరవ భవణాలు సాధించుకోక పోవడానికి కారణం కూడా అనేక సంఘాలుగా ఉండడమే అన్ని అన్నారు. ఐక్యం కావడానికి త్వరలో ములుగు జిల్లా కేంద్రంగా జరిగే మహసభ వేధిక కావాలని అందకు అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు సిధ్దం కావాలని కోరారు. సకలసామాజిక రంగాలలో మేమెంతో మాకంత వాటా అనే నినాదం తో ముందుకు సాగవలసిన అవసరం ఉంది అన్నారు. ఇంకా అనేక హక్కులు సాదించుకునే దిశగా పోరాటాలకు సిధ్దంకావాలని పిలుపునిచ్చారు.అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మండల అధ్యక్షడు గా సిరిమర్తి మల్లికార్జున్, కార్యదర్శిగా ముక్కెర రాజశేఖర్, ఎనుకున్నారు. ఈ సమావేశంలో ముక్కెర నాగేశ్వరావు, బద్దెల సత్యనారాయణ, ఎం నాగేశ్వరావు, ధాగం మధు, డి రాంబాబు,యస్ వెంకటేశ్వర్లు, ఎం సమ్మయ్య, యస్ అరుణ్, బి శ్రీకాంత్, డి, విష్ణువర్ధన్ రావు, పాల్గొన్నారు.


