కాంగ్రెస్ విజయానికి చేరికలు నాంది

      బిఆర్ఎస్ కు భారీ షాక్‌..కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు     మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకట్రావ్         రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్,నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని, వీరి చేరికలు మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది అని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. తదితరులకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.         […]

Continue Reading

ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు.. పోలీసులపై రాళ్ల దాడి

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొంతమంది దుండగులు పోలీస్ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్‌లీల మైదాన్‌లోని తుర్క్‌మన్ గేట్ వద్ద సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు, శ్మశాన వాటిక ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు అక్రమ […]

Continue Reading

ఉత్తరాంధ్రకు మరో శుభవార్త.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు

విశాఖ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణ కోసం అవసరమైన ఉద్యోగుల కేటాయింపుపై రైల్వే అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Continue Reading

Tamilnadu: వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections) దగ్గరపడుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి (NDA)తో పట్టాలి మక్కల్ కట్టి (PMK) చేతులు కలిపింది. పీఎంకే అధ్యక్షుడు అంబుమణి రామదాస్ (Anbumani Ramadoss) తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలుసుకుని ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు.

Continue Reading

కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

ముంబై: రాజకీయ ప్రత్యర్థులు అధికారం కోసం కొత్త పొత్తులకు తెరతీయడం మహారాష్ట్ర (Maharashtra)లో తాజాగా సంచలనమైంది. అంబర్‌నాథ్, అకోలా మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ నేతలు కాంగ్రెస్, అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎంతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ కొత్త ‘పొత్తులు’ రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పొత్తులు ఆమోదయోగ్యం కాదని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్థానిక బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇలాంటి ఏర్పాట్లకు పార్టీ అధిష్టానం ఎంతమాత్రం […]

Continue Reading

కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ‘ఇండియా’ (INDIA) కూటమి సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే కలిసే ఉన్నాయని, ఇరుపార్టీల మధ్య ఉన్న చిరకాల భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడులో ‘ఇండియా’ కూటమి భాగస్వాముల మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు.

Continue Reading

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

అధికార కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలకు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల వేడి బాగా పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదబారాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతుబంధు ఏమైందని ప్రశ్నిస్తే.. లాగులో తొండలు వదులుతాం అంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి […]

Continue Reading

పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌(Madhuranagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన గొల్ల రవి(25) ఆటో డ్రైవర్‌. లక్ష్మీనరసింహ నగర్‌లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. డిసెంబరులో అయ్యప్ప దీక్ష తీసుకొని శబరియాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. దీక్షలో ఉన్నప్పుడు పక్క గల్లీలో ఒక గదిని కిరాయికి తీసుకొని ఒక్కడే […]

Continue Reading

మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు.. యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి అరెస్ట్

యూట్యూబ్ వేదికగా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి అలియాస్ సత్యమూర్తి(39)ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్నారులకు అసభ్యకర ప్రశ్నలు వేసి, ఆ వీడియోలు ప్రమోట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

డైలీ సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మెదక్‌లో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్‌లా సాగుతోందని వ్యంగ్యంగా అన్నారు. కొండను తవ్వి ఎలుకను ఈ సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) పడుతుందో లేదో ? అంటూ సందేహం వ్యక్తం చేశారు. డేటాను సర్వీస్ ప్రొవైడర్ల వద్ద తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. నేడు కొండల్ రెడ్డి, రేపు ఆయన డ్రైవర్ ఇలా ఎన్నాళ్లు అంటూ? […]

Continue Reading