మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. తాజాగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ) కసరత్తు చేస్తోంది. అందుకోసం బుధవారం జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధిరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి12వ తేదీ లోపు ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఈ సందర్భంగా ఆయా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అలాగే జనవరి 13వ తేదీన టీ పోల్ […]

Continue Reading

త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు

పేరూరు ప్రాజెక్టు కాలువ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత(MLA Parita Sunitha) అన్నారు. గంగులకుంటలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఆమె హాజరయ్యారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.13.05 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించారు. విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై జగన్‌ తన బొమ్మ వేసుకునేందుకు చూపిన శ్రద్ధ భూసమస్యల పరిష్కారంపై చూపలేదని విమర్శించారు.

Continue Reading

నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ‘మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండటంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. […]

Continue Reading

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని.. గడువులోగా మిగిలిన పనులన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన […]

Continue Reading

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్

విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. బుధవారం […]

Continue Reading

సంక్రాంతికి ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి

హైదరాబాద్: సంక్రాతికి(Sankranti) ఊరు వెళ్లే వారు తమ ఇళ్లలో చోరీలు జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సీఐ సుధీర్‌కృష్ణ సూచించారు. ఊరు వెళ్లడానికి ముందే ఇంటి మొయిన్‌ డోర్‌కు సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ను, సెక్యూరిటీ అలారం, సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెండి, బంగారం ఆభరణాలు, డబ్బులను ఇంట్లో ఉంచుకుండా బ్యాంక్‌ లాకర్‌లో భద్రపర్చుకోవాలని అన్నారు. ఇంట్లోని ఒక లైట్‌ను ఆన్‌చేసి వెళ్లాలన్నారు. కార్లు, టూ వీలర్లకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చుకోవాలని, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుకొని, ఎప్పటికప్పుడు […]

Continue Reading

Nizamabad Jail: నిజామాబాద్‌ జైలర్‌ సస్పెన్షన్‌

నిజామాబాద్‌ జిల్లా సెంట్రల్‌ జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్థి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్‌ను సస్పెండ్‌ చేశారు. మరో జైలర్‌పై బదిలీ వేటు వేశారు. సూపరింటెండెంట్‌ను నెల రోజులు సెలవు పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 1న ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో గంజాయి గుప్పు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై […]

Continue Reading

చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌.. ఆపై టెర్ర్‌సపై నుంచి తోసి హత్య

ఇంటిపై అద్దెకు ఉండే ఇద్దరు వ్యక్తులే ఆ చిన్నారి పాలిట కీచకులయ్యారు. టెర్ర్‌సపైకి ఆడుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు టెర్ర్‌సపై నుంచి ఆమెను తోసేసి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో శుక్రవారం ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు రాజు, కశ్య్‌పలపై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన సీనియర్‌ ఎస్పీ.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు […]

Continue Reading

Cyber Crime: నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

హైదరాబాద్‌ సిటీ: కొత్త ఏడాది వేడుకలను క్రూజ్‌లో జరుపుకుందామని భావించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసిన నగరవాసిని క్రూజ్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ సంప్రదించి కొందరు మోసం చేశారు. రూ.2.42లక్షలు వసూలు చేశారు. కాచిగూడ(Kachiguda) ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుటుంబంతో కలిసి కొత్త ఏడాది వేడుకలు క్రూజ్‌లో జరుపుకోవాలని భావించాడు. దీనికోసం డిసెంబరు 26న ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ సందర్భంలో కొచ్చి, లక్షద్వీ్‌పల మీదుగా ముంబైకి క్రూజ్‌ సేవలందించే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు.  

Continue Reading

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వెంటనే సోయా కొనుగోళ్లను (Soybean Purchase Protest) చేపట్టాలని ఈ రోజు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో(Jogu Ramanna) పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. సోయా కొనుగోలులో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు, సరైన రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి […]

Continue Reading