Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

తెలంగాణ
Spread the love

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వెంటనే సోయా కొనుగోళ్లను (Soybean Purchase Protest) చేపట్టాలని ఈ రోజు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో(Jogu Ramanna) పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. సోయా కొనుగోలులో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు, సరైన రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో ఆర్టీసీ డిపో వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. జోగు రామన్నతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *