Cyber Crime: నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

హైదరాబాద్‌ సిటీ: కొత్త ఏడాది వేడుకలను క్రూజ్‌లో జరుపుకుందామని భావించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసిన నగరవాసిని క్రూజ్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ సంప్రదించి కొందరు మోసం చేశారు. రూ.2.42లక్షలు వసూలు చేశారు. కాచిగూడ(Kachiguda) ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుటుంబంతో కలిసి కొత్త ఏడాది వేడుకలు క్రూజ్‌లో జరుపుకోవాలని భావించాడు. దీనికోసం డిసెంబరు 26న ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ సందర్భంలో కొచ్చి, లక్షద్వీ్‌పల మీదుగా ముంబైకి క్రూజ్‌ సేవలందించే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు.  

Continue Reading

దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో.. జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య

సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న జూనియర్‌ డాక్టర్‌ బి.లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణం అని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఆస్పత్రిలో జనరల్‌ మెడిసిన్‌ చదువుతున్న వైద్యుడు ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి మాటెత్తేసరికి దళితురాలంటూ దూరం పెట్టడంతోనే ఆమె మనస్త్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తేల్చారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామానికి […]

Continue Reading

గుడిలో భారీ చోరీ.. ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్ నగరంలోని ఆలయంలో భారీ చోరీ జరిగింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయంలో దొంగలు స్వామి వారి నగలను చోరీ చేశారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. దుండగులు అర్ధరాత్రి సర్దార్ పటేల్ నగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహంపై ఉన్న రూ.50 లక్షల విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుడి దగ్గరకు చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. […]

Continue Reading