దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో.. జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య

క్రైమ్
Spread the love

సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న జూనియర్‌ డాక్టర్‌ బి.లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణం అని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఆస్పత్రిలో జనరల్‌ మెడిసిన్‌ చదువుతున్న వైద్యుడు ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి మాటెత్తేసరికి దళితురాలంటూ దూరం పెట్టడంతోనే ఆమె మనస్త్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తేల్చారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబానికి చెందిన బి. లావణ్య (23) సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *