నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్ లు 

Uncategorized
Spread the love

 

 

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ప్రకృతి వనరులు మానవాళికి జీవనాధారాలు కానీ అభివృద్ధి పేరిట గత దశాబ్దంన్నర కిందట వెలసిన శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యూనిట్ గ్రామంపై పగబట్టినట్లుగా మారింది.లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ పనులు పత్తిపాక ఉనికిని,అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది.దీనికి తోడు మరో గుట్టకు నూతనంగా మరో క్రషర్ పెట్టడానికి సన్నాహాలు చేయటం మూలిగే నక్కపై తాటికాయ వేయటమే అవుతోంది.గ్రామ శివారులో ఉన్న గుట్టలు ఒకప్పుడు ఆ ప్రాంతానికి రక్షణ కవచాలుగా ఉండేవి కానీ నేడు క్రషర్ల దౌర్జన్యం వల్ల ఈ గుట్టలు క్రమంగా కరిగిపోతు నిరంతరం జరుగుతున్న భారీ పేలుళ్ల కారణంగా గుట్టలు ధ్వంసమవుతున్నాయి.ఈ గుట్టల తొలగింపు వల్ల కేవలం ప్రకృతి అందం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతోంది.ఇది భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడికి దారితీస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటి ఇక్కడ మాత్రం ఆ హెచ్చరికలు పట్టించుకునే నాధుడే లేఖ గ్రామం లోని రైతాంగం నేడు ఆ క్రషర్ వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.క్రషర్ యూనిట్, డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడే విపరీతమైన దుమ్ము,సూక్ష్మ రసాయన కణాలు గాలిలో కలిసి పొరుగున ఉన్న పంట పొలాలపై పేరుకుపోతున్నాయి.దీనివల్ల మొక్కల ఆకులపై దుమ్ము చేరి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలుగుతోంది పంటల పెరుగుదల ఆగిపోయి,దిగుబడి గణనీయంగా తగ్గుతోంది నాణ్యత లేని దిగుబడి వల్ల మార్కెట్‌లో రైతులకు సరైన ధర లభించడం లేదనీ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.గ్రామంలోని చెరువులు క్రషర్ వ్యర్థాలకు నిలయాలుగా మారుతున్నాయి. యూనిట్ల నుంచి వచ్చే మట్టి,రాతి పొడి వర్షపు నీటితో కలిసి చెరువు, కుంటలలో చేరుతుండటంతో నీరు విషతుల్యమవుతోంది.దీనివల్ల జల జీవవ్యవస్థ దెబ్బతిని,చేపలు తదితర జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. క్రషర్ వల్ల ప్రాణహాని,ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలంతా ఏకమై కరపత్రాలతో ధర్నాలు చేస్తూ అధికారులకు విన్నవించుకున్నా అధికారులు మాత్రం స్పందించడంలేదు.

 

 

ముదిరాజ్ సమన్వయకర్త పల్లెబోయిన సుధాకర్….

 

 

స్టోన్ క్రషర్ల నుండి వచ్చే దుమ్ము ధూళి,బ్లాస్టింగ్ల వల్ల పంటపొలాలు దెబ్బతింటున్నాయి ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే గ్రామస్థులు,బాధితులు ఏకమై తమ గళాన్ని వినిపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవకపోవటం సరైనది కాదు.నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్టోన్ క్రషర్లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.గుట్టల మనుగడను కాపాడటానికి భారీ పేలుళ్లను నిలిపివేయాలి కలుషితమైన చెరువులను ప్రక్షాళన చేసి,వ్యర్థాలు చేరకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతి యూనిట్‌లో దుమ్ము నివారణకు శాస్త్రీయ పరికరాలను ఏర్పాటు చేయాలి పత్తిపాక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్,డాంబర్ ప్లాంట్ ను ఎందుకు మూసివేయకూడదో అధికారులు సమాధానం చెప్పాలి.పత్తిపాక ప్రజల ఆవేదనను ఆలకించి,అక్కడి గుట్టలు,చెరువులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేనిపక్షంలో భవిష్యత్ తరాలకు మనం కేవలం కాలుష్యాన్ని,ఎడారిని మాత్రమే మిగిల్చిన వారమవుతామనేది గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *