పేరుకే ప్రజాదర్బారు,సమస్యలు గాలికె..!!

హైదరాబాద్
Spread the love

 

ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బారులొ ఏమి పరిస్కారం?

అధికారుల నిర్లక్షంపై ప్రజలు ప్రజాసంఘాలు ద్వజం

ప్రజల అర్జిలు పైకిపోతెకథా కలెక్టర్,మంత్రి పరిస్కరించేది

గ్రామంలొ ఎక్కడిచెత్త అక్కడె,వడబెబ్బపై ప్రజలకు అవగాహన ఏది

ఉపాదికూలీల ఆరోగ్యం,తాగెనీరు, ఒ ఆర్ ఎస్ పంపిణి ఏది

  • ములుగు జిల్లా క్రైం,నాడు నేడు, జూన్ 04-

    ప్రజలకోసమె ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్న అధికారులు సమస్యల పరిస్కరం ఏది,,? అనిప్రశ్నిస్తున్నారు.ఇప్పటికి మూడుదపాలు అయిపోయి 4దఫాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభల జరుగ నున్నది కాని జరిగిన సభలలొ ప్రజలు, విద్యార్థులు,మహిళలు, రైతులు,యువకులు, వృద్దులు సమర్పించిన దరఖాస్తులకు పరిస్కారంఏది అంటు మండిపడుతున్నారు. మళ్లి ఏ ముఖం పెట్టుకుని అధికారులు ప్రజాదర్బారు నేడు శుక్రవారం రావాలని ప్రజలను పిలుస్తున్నారు అంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్పంచులు కాకుండ ఇంచార్జీలుగా గ్రామ స్పెషల్ అధికారులను కలెక్టర్ ఏర్పాటు చేస్తె వస్తున్నారు పంచాయితీకార్య దర్సులుకూడ గ్రాసమస్యలపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆరొపిస్తున్నారు సర్పంచులు రాకముందు కొంచెం పట్టించుకునెది,సర్పంచులు వచ్చాక సమస్యలపై మఖాలు చాటేస్తున్నారు.

ఎక్కడి సమస్యలక్కడె,పారిశుద్యం పట్టనివైనం….

గ్రామాలలొ ఎక్కడిసమస్యలు అక్కడె పారిశుద్యం అక్కడె అనెచందంగా నెలకుంది ఎదొ ఊరిలోకి పోయినామ వచ్చామా అన్నట్లుగానె కార్యదర్సులు వ్యవహరిస్తున్నరనె విమర్సలు వస్తున్నాయి గ్రామంలొని రోడ్లవెంబడి చెత్త,చెదారం ఎక్కడిదక్కడె ఎత్తివేయడం లేదు, గంగారం, తాడ్వాయి,మేడారం, బీరెల్లి, దామెరవాయి, కామారం,పంబాపురం,నార్లాపురం, ఊరట్టం, బయక్కపేట,లింగాల గ్రామాలలొ ప్రజాసమస్యలను కార్యదర్సులు పట్టింపులేదు,విమర్సలు, ఆవేదనలు వస్తున్నాయి.

ఉపాదికూలీల ఆరోగ్యంపై పీల్డ్ అస్టెంట్లకు పట్టింపేది……

భగ భగ మండె ఎండలొ కూలీలు పొట్ట చేతపట్టుకుని పనులు చేస్తుంటె పీల్డ్ అస్టెంట్లకు పట్టింపేది,,? అని సర్వత్ర ప్రశ్నిస్తున్నారు.మట్టిపనులు (ఎన్ ఆర్ ఈ జి ఎస్)చేస్తున్న కూలీలు ఎండకు గూరికాకుండ టెంట్లు,దాహంవేయకుండా నీళ్లుబాటిల్లు,ఒ ఆర్ ఎస్ ప్యాకేట్లు,మజ్జిగ ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వం ఇచ్చిన టెంట్లు,కిట్లు, ప్లాస్టిక్ డ్రమ్ములు ఇండ్లలొ పెట్టుకుని బయటకు తేవడంలేదని పలు గ్రామాలలొ కూలీలు ఆరోపిస్తున్నారు.ఎంపిడిఒ పనులను సందర్సిస్తున్నరు కాని ఇవేవీ అని పిల్డ్ అస్టెంట్లను ప్రశ్నించడం లేకపోవడం వెనుకేసుకుని వస్తున్నట్లు విమర్సులు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *