మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

తెలంగాణ
Spread the love

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. తాజాగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ) కసరత్తు చేస్తోంది. అందుకోసం బుధవారం జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధిరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి12వ తేదీ లోపు ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఈ సందర్భంగా ఆయా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అలాగే జనవరి 13వ తేదీన టీ పోల్ ( T-POLL) యాప్‌లో పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఇక జనవరి 16వ తేదీన పోలింగ్‌ స్టేషన్ల వారీగా.. ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *