యూట్యూబ్ వేదికగా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తున్న యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి అలియాస్ సత్యమూర్తి(39)ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్నారులకు అసభ్యకర ప్రశ్నలు వేసి, ఆ వీడియోలు ప్రమోట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

