చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ‘ఇండియా’ (INDIA) కూటమి సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే కలిసే ఉన్నాయని, ఇరుపార్టీల మధ్య ఉన్న చిరకాల భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడులో ‘ఇండియా’ కూటమి భాగస్వాముల మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు.

