అధికార కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలకు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల వేడి బాగా పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదబారాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతుబంధు ఏమైందని ప్రశ్నిస్తే.. లాగులో తొండలు వదులుతాం అంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. ఆయనలో అంత ఫ్రస్టేషన్ ఎందుకో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. సెక్యూరిటీ వాళ్ళతో పాటు పోలీసుల్ని సైతం ఆయన కొడుతున్నారని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డి ప్రస్టేషన్లో ఉన్నాడని.. అరుస్తున్నాడు.. కొడుతున్నాడు.. రేపు ఎవరినైనా కరుస్తాడేమో జాగ్రత్త’ అంటూ సీఎం భార్య గీతకు ఈ సందర్భంగా కేటీఆర్ హితవు పలికారు.

