అన్ని హంగులతో ముస్తాబైన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర 

తెలంగాణ
Spread the love

సిద్ధమైన వనదేవతలు

నేడు సారలమ్మ గద్దెకు రాక

♦


ఆhttp://అన్ని హంగులతో ముస్తాబైన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరత్మకూర్ జనవరి 27(నాడు నేడు ప్రతినిధి) మేడారం గా ప్రసిద్ధిగాంచిన మండలంలోని అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని అంగులతో ముస్తాబు చేశారు. నేడు సాయంత్రం సారలమ్మను గద్దెకు తీసుకువచ్చేందుకు పూజారులు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. తల్లుల వన ప్రవేశంతో మొదలైన జాతర మూడు రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చి,శనివారం తిరిగి వన ప్రవేశం గావిస్తారు. భక్తుల కొంగు బంగారం అయినా సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల, జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. భక్తుల కు తాగునీరు స్నాన ఘట్టాలు మరుగుదొడ్లు విడిది ప్రదేశాలను తలనీలాలు సమర్పించే ఏర్పాట్లులను అధికారులు పూర్తి చేశారు.జాతర పాలకవర్గం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జాతరలో లైటింగ్, పార్కింగ్ ఏరియాలు,సీఐ సంతోష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. తల్లులను కొలిచి,మొక్కులు నిలువెత్తు బంగారం కొబ్బరికాయలతో పసుపు కుంకుమలతో శివశక్తుల పూనకాల మధ్యన జాతర పూజారులు అమ్మవార్లను గద్దెకు చేర్చడం జరుగుతుంది. మహా జాతర ఘట్టం నేటితో మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *