అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేద్దాం 

తెలంగాణ
Spread the love

తరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఆత్మకూరు జనవరి 27(నాడు నేడు ప్రతినిధి)త్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతకుముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసామన్నారు.జాతర వచ్చే భక్తులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. భక్తుల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, విద్యుత్ వంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.జాతరను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జాతర చైర్మన్ వంచ రంగారెడ్డి,రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి,ఆర్డీవో నారాయణరెడ్డి,తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్,సర్పంచులు ముద్దం సాంబయ్య,గంగుల మహేందర్,, కాంగ్రెస్ జిల్లా నాయకులు రేవూరి జలంధర్ రెడ్డి, రెడ్ క్రాస్ డైరెక్టర్ బిల్లా రమణారెడ్డి, అక్కంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ముద్దం కృష్ణంరాజు, డాక్టర్ స్పందన,కాంగ్రెస్ నాయకులు ముద్దం సాంబయ్య, అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *