అయ్యవారిపేటలో ఘనంగా బొడ్రాయి ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ
Spread the love

అయ్యవారిపేటలో ఘనంగా బొడ్రాయి ప్రధమ వార్షికోత్సవ వేడుకలు..

 

 

వాజేడు, ఫిబ్రవరి7 :మండల పరిధిలోని అయ్యవారిపేట గ్రామంలో మాఘ బహుళ షష్టి శనివారం శ్రీ విశ్వావస గ్రామ దేవత (బొడ్రాయి) ప్రధమ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం బొడ్రాయి వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు గ్రామ పురోహితులు రంగు రవీంద్ర చార్యుల ఆధ్వర్యంలో గ్రామదేవత (బొడ్రాయి) కార్యనిర్వహకులు గ్రామ పెద్దలు పలిశెట్టి శ్రీనివాస్, సర్పంచ్ మడకం బెనిని, నరసింహ చారి, ఉప సర్పంచ్ కాలేశ్వరం సర్వేశ్వరరావు, తదితరులు గ్రామస్తులు పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరపూజ, గోపూజ, స్వస్తివాచనము, స్థలశుద్ది కార్యక్రమం, మండపరాదనలు, హోమములు జరిపారు. తదనంతరం బొడ్రాయి దేవతకు భక్తులతచే జలాభిషేకములు, పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహాదాశీర్వచనం నిర్వహించారు.సహస్ర ఘటాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతాంగం పంటలు సమృద్ధిగా పండి రైతాంగం చల్లంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి అంటూ పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజారం, కాలేశ్వరం సంతోష్, రవి, పాపారావు, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *