తునికాకు బోనస్ నిధుల దుర్వినియెగం పై సీరియస్
>విచారణలొ తేలితె కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
ములుగు జిల్లాలోనె ఒ జిల్లా ఉన్నాధికారి,5 గురు రేంజర్లు
ప్రజల ఫిర్యాదుపై స్పందించిన సమాచార కమీషనర్
బోనస్ డబ్బులు రు90 లక్షలు వాడకంపై విచారణ
3రోజుల్లొ వివరణ ఇవ్వాలని ఆదేశం
అక్రమాలు తేలితె బాద్యుల నుంచి సొమ్ము రికవరీ
ములుగు జిల్లా క్రైం,నేడు నాడు,జూన్ 04
కష్టంచేసి పొట్టకూటి కోసం కూలీలు తునికాకు కోశారు,ప్రభుత్వం చేల్లించె లక్షల రూపాయల బొనస్ డబ్బులను కాజేసిన అవినీతి బాగోతం చవిచూసి నట్లు సమాచార చట్టంకు అందిన పిర్యాదుతొ స్పందించారు. బోనస్ డబ్బులు కాజేసిన,అక్రమాలు తేలితె కఠినచర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెల్సింది,ఇద్దరు ఎంక్వయిరీ అధికారులను నియమించి విచారణకు ఆదేశించినట్లు తెల్సింది,అంతెకాకుండా ములుగు జిల్లా అటవీశాఖలొ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా 5 గురు రేంజర్లు ఈ బోనస్ డబ్బులను కాజేసినట్లు పిర్యాదు దారులు తనపిర్యాదులొ వివరించినట్లు,దీనిపై స్పందించిన సమాచార చట్టం కమీషనర్ కొరడా ఘలిపించనున్నట్లు తెల్సింది.ఇప్పటికె అటవీశాఖలొ బదిలీలు అయి ఎటువారుఅటె మండలాలు మార్పులు జరిగాయి జిల్లా ఉన్నాధికారి కూడ బదిలీ అయ్యారు రేంజర్లు బదిలీపై వెల్లారు అయినప్పటికి విచారణలొ అక్రమాలు తేలితె వాడకం జరిగిన రు 90 లక్షలు ఈ 5గురు రేంజర్లనుంచి రికవరీ చేయించుటకు చర్యలు చేపట్టినట్లు తెల్సింది బదిలీపై వెల్లినా అవినీతి సొమ్మును కక్కించక తప్పదని వివరించారు.అందుకు బాద్యులైన వారిపై చర్యలు తప్పవని ఎంతటివారైన సహించేది లేదన్నట్లు సమాచారం.ట్రాన్స్ పర్ అయిపోయం కథా మాకేం అవుతుందని భుజాలు ఎగిరెస్తున్నట్లు సమాచారం ఈ 5
గురిలొ ఒకరు మహిళా రేంజర్ మిగతా 4 గురు జెన్స్ అని తెలుస్తుంది.సమాచార కమీషనర్ తునికాకు బోనస్ అక్రమాలపై కొరడా ఝలిపించుతున్నట్లు బయటకు వెల్లడి కావడంతొ అటవీశాఖలొ ప్రకంపనలు మొదలయ్యయి.

