జంగాలపల్లి బాలికల మినీ గురుకులం ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం…

తెలంగాణ
Spread the love

 

నాడు నేడు /వాజేడు /ఏప్రిల్ 19: ములుగు జిల్లా, వాజేడు మండలం జంగాలపల్లి మినీ గురుకుల బాలికల పాఠశాలలో 2026- 27 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ములుగు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ నాయక్, మినీ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ జే, సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు సంవత్సరాల బాలికలకు అవకాశం కలదు. ఖాళీల వివరాలు 1వ తరగతిలో 30 సీట్లు, బ్యాక్లాగ్ సీట్లు రెండవ తరగతిలో 9 సీట్లు, మూడవ తరగతిలో మూడు సీట్లు, నాలుగవ తరగతిలో ఒక్క సీటు, 5వ తరగతిలో నాలుగు సీట్లు, ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. అర్హులైన విద్యార్థినులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. ఈనెల 20 -4 -2026 నుండి మే నెల 5- 5 -2026 వరకు దరఖాస్తు చేసుకోగలరు .వాజేడు, వెంకటాపురం మండలాల విద్యార్థినులకు అవకాశం కలదు మొదటి ప్రాధాన్యత స్థానిక మండలాలలోని విద్యార్థులకు కలదు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఆధార్ కార్డు, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్, కులం, ఆదాయం సర్టిఫికెట్స్, పాస్ ఫొటోస్ నాలుగు, తీసుకొని పాఠశాలలో సంప్రదించగలరు ఎంపిక విధానం డ్రా చేయబడును ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం వసతి సౌకర్యం నోటు పుస్తకాలు, బెడ్ షీట్స్, దుస్తులు టెక్స్ట్ బుక్స్, తదితర అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించబడునని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *