బిఆర్ఎస్ కు భారీ షాక్..కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకట్రావ్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్,నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని, వీరి చేరికలు మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది అని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. తదితరులకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
వాజేడు/నాడు నేడు/ జనవరి 7: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో బుధవారం పది కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ.. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎ పీడీఓ కార్యాలయంలో 37మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ, ఆస్ఐ కుమారస్వామి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, నాయకులు దంతులూరి విశ్వనాథప్ర సాద రాజు, జగన్నాథరాజు, అల్లి నాగేశ్వరావు, విజయ్ ఉన్నారు.


