ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మెదక్‌లో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్‌లా సాగుతోందని వ్యంగ్యంగా అన్నారు. కొండను తవ్వి ఎలుకను ఈ సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) పడుతుందో లేదో ? అంటూ సందేహం వ్యక్తం చేశారు. డేటాను సర్వీస్ ప్రొవైడర్ల వద్ద తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. నేడు కొండల్ రెడ్డి, రేపు ఆయన డ్రైవర్ ఇలా ఎన్నాళ్లు అంటూ? సిట్ వ్యవహారశైలిపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కర్త, కర్మ అన్ని ఒకరివైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ రఘునందన్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందన్నారు. SIT కాస్తా CIT( కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లా మారిందంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బాధితుడిని తానేనని గుర్తు చేశారు

