కుషాయిగూడ పాత మార్కెట్ ను సందర్శించిన జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు* 

తెలంగాణ
Spread the love

 

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జనవరి 10, నాడు నేడు ప్రతినిధి:- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొమ్మల పల్లి నర్సింహులు యాదవ్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్ డైరెక్టర్ పూర్ణ యాదవ్, మరియు జే ఎంఎస్ కార్తీక్ గార్లతో కలిసి కుషాయిగూడ కూరగాయల పాతమార్కెట్నుపరిశీలించారు.పాతమార్కెట్ లో కూరగాయల ఓల్ సెల్, కాంట దుకాణాలు లైసెన్స్ కలిగివుండాలని, లైసెన్స్ లేనివారు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలన్నారు. కుషాయిగూడ ప్రధాన రహదారినిఆక్రమించకుండా వ్యాపారాలుకొనసాగించాలన్నారు.కుషాయిగూడ కూరగాయల పాతమార్కెట్ ఓల్ సేల్ మరియు కాంట వ్యాపార సముదాయాల సంఘం ప్రతినిధులు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్, జే ఎం ఎస్ గార్లను ఘనంగా సన్మానించారు. అనంతరం తమ మార్కెట్ టిజిపిఎల్ఎల్ సి స్థలం లో ఉందని, ప్రభుత్వం తమ వ్యాపార కళాపాలకు అనుకూలమైన స్థిరమైన స్థలం కేటాయించాలని వినతి పత్రం అందించారు.జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ- కుషాయిగూడ కూరగాయల పాతమార్కెట్ ఓల్ సేల్ మరియు కాంట సముదాయాల వ్యాపారాలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి గారికి వివరించి, వారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామనిహామీఇచ్చారు.వ్యాపారులు నాణ్యమైన కూరగాయలను ప్రభుత్వ ధరలకు విక్రయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ కూరగాయల పాత మార్కెట్ కాంట మరియు హోల్ సేల్ వ్యాపార సముదాయాల కమిటీ ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, సెక్రటరీ చేతుర్ల దేవేందర్ గౌడ్,సభ్యులు గణేష్ ముదిరాజ్ కొరెల్లి రాఘవేందర్ గౌడ్ శీలం తిలక్ యాదవ్ శీలం సన్నీ యాదవ్ దూసరి వెంకటేష్ అక్కమనేని ఆంజనేయులు, రాగిరి సాకేత్ గౌడ్, భీమ్ రాజ్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *